బీడీఎల్ తో యూఏఈ సంస్థ ఒప్పందం
రక్షణ రంగంలో నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), యూఏఈకి చెందిన తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ (టీఈసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. యూఏఈ సైన్యం, రక్షణ అవసరాలకు అవసరమైన ఆయుధ సామగ్రి, ఉపకరణాలను తవాజున్ ఎకనామిక్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అక్కడకు అవసరమైన కొనుగోళ్లు ఈ సంస్థ ద్వారా జరుగుతాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం టీఈసీతో కలిసి బీడీఎల్ మిలటరీ ఉపకరణాలు, ఆయుధాలను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహణ` మరమ్మతు, ఉత్పత్తి తదితర కార్యకలాపాలు చేపడుతుంది. ఎగుమతులు నిర్వహించే అంశాన్నీ ఈ రెండు సంస్థలు పరిశీలిస్తాయి.






