అమెరికాకు అరబిందో ఔషధం

అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ, యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్‌కు చెందిన యూగియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లిడోకైన్ హైడ్రోక్లోరైడ్ అనే ఔషధానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి సంపాదించింది. ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పరవాడలో యూనిట్ ఉంది. ఈ యూనిట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ బృందం ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో తనిఖీ చేసింది. ఈ యూనిట్ నుంచి అందించే ఔషధానికి ఇప్పుడు అనుమతి ఇచ్చింది. లిడోకైన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్‌ను 10 ఎంజీ/ ఎంఎల్, 20 ఎంజీ/ ఎంఎల్ డోసుల్లో అందించేందుకు అనుమతి లభించిందని అరబిందో ఫార్మా తెలిపింది.