అదే గనుక జరిగితే .. పేద దేశాలకు ఇది పెద్ద
ద్రవ్యోల్బణంపై పోరులో భాగంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. అదే గనుక జరిగితే పెద్ద దేశాలకు ఇది పెద్ద ఎదురుదెబ్బే కాగలదన్న ఆందోళనలు వ్యక్త మవుతున్నాయని తెలిసింది. ఇప్పటికే గత రెండు దశబ్దాల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లింపు భారంగా పరిణమించింది. ఈ పరిస్థితిలో వడ్డీ రేట్లు మరింత పెరిగితే పేద దేశాలు వాటిని తట్టుకునే స్థితి లేదని తెలిసింది. 2021లో పేద దేశాల ప్రభుత్వ ఆదాయాల్లో ఈ రుణాలు చెల్లింపులే 14.3 శాతంగా ఉన్నాయి. 2021లో ఇది కేవలం 6.8 శాతంగానే ఉంది. 2001 తర్వాత వడ్డీ రేట్లు ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి. బ్రిటీష్ చారిటీ సంస్థ జూబ్లీ డెట్ కేంపైన్ అందించిన డేటాను ఉటంకిస్తూ పై వివరాలు ఇచ్చింది. అనేక పేద దేశాలు అమెరికన్ డాలర్లలోనే రుణాలు తీసుకుంటాయి.






