యాపిల్ కు మరో ఎదురుదెబ్బ
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో కీలక ఎగ్జిక్యూటివ్ వైదొలగనున్నట్లు సమాచారం. ఐఫోన్, యాపిల్ వాచ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన టాంగ్ టాన్ కంపెనీ నుంచి నిష్ణ్రమించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఫిబ్రవరి నుంచి ఆయన అందుబాటులో ఉండకపోవచ్చునని విశ్వసనీయ వర్గాలను ద్వారా తెలిసింది. టాంగ్ టాన్ నిష్ణ్రమణ యాపిల్ కు ఎదురుదెబ్బగా పలువురు టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీలో ఆయన ప్రోడక్ట్ డిజైన్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా హోదా పని చేస్తున్నారు. యాపిల్ ఉత్పత్తుల విక్రయాల్లో ఐఫోన్, యాపిల్ వాచ్‌లదే కీలక వాటా. కంపెనీ ఆదాయంలో దాదాపు సగం వీటి అమ్మకాల నుంచే వస్తోంది. టాంగ్ టాన్ వీటి రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అలాగే ఎయిర్‌పాడ్స్ డివైజ్‌లోనూ ఆయన తోడ్పాటు చాలా ముఖ్యమైందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆయన కృషి వల్లే కంపెనీలో వృద్ధిలో వాచ్, ఎయిర్‌పాడ్స్ కీలకంగా మారాయని వెల్లడించాయి.






