శాంసంగ్ కు యాపిల్ షాక్

దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్‌కు యాపిల్ షాక్ ఇచ్చింది. ప్రపంచ స్మార్ట్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ శాంసంగ్‌ను యాపిల్ వెనక్కి నెట్టింది. 12 సంవత్సరాలుగా శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అత్యధిక స్మార్ట్ ఫోన్లు సరఫరా చేసిన కంపెనీగా తొలిసారి యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2023కు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సంబంధించిన గణాంకాలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ సరఫరా విషయంలో శాంసంగ్ 2010 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలిసారి యాపిల్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో మొత్తం 23 మిలియన్ యూనిట్లను యాపిల్ సరఫరా చేసినట్లు ఐడీసీ తెలిపింది.