శాంసంగ్ కు యాపిల్ షాక్

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో యాపిల్ అద్భుతమైన ఫలితాలు ప్రకటించింది. భారత్‌లో యాపిల్ ఆదాయపరంగా గత త్రైమాసికాల రికార్డును అధిగమించినట్లు కంపెనీ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆదాయంలో శాంసంగ్‌ను యాపిల్ దాటేసిందని కొన్ని రోజుల క్రితమే కౌంటర్ పాయింట్ అనే టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధిస్తోంది. మలేసియా, మెక్సికో, ఫిలిప్పీన్స్, పోలాండ్, తుర్కియే, ఇండోనేసియా, సౌదీ అరేబియా, చిలీలతో పాటు భారత్‌లోనూ డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయని టీమ్ కుక్ తెలిపారు. 2023లో కోటి యూనిట్ల సరఫరాతో యాపిల్ తొలిసారిగా ఆదాయపరంగా ఆగ్రస్థానానికి చేరుకుంది. భారత్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన యాపిల్ ముంబై, ఢిల్లీలో కంపెనీ స్టోర్లను ప్రారంభించింది. 2027 నాటికి మరో మూడు చోట్ల యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. యూరప్ తరువాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్లను విస్తరించాలనే లక్ష్యంతో వీటిని నెలకొల్పనున్నట్లు యాపిల్ తెలిపింది.