Apple : త్వరలోనే భారత్‌లో యాపిల్ స్టోర్.. ఎక్కడంటే?

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ముంబయి, ఢల్లీిలో ఉన్న స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మూడో స్టోర్‌ను ప్రారంభించనుంది. దీనికోసం బెంగళూరు (Bangalore) ను ఎంచుకుంది. హెబ్బాల్‌లోని ఫీనిక్స్ మాల్‌లో నూతన స్టోర్ ఏర్పాటు చేయనుంది. బెంగళూరు పీనిక్స్ మాల్ (Phoenix Mall) మొదటి అంతస్తులో 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో యాపిల్ మూడో స్టోర్‌ను ఏర్పాటు చేయనుంది. ఢల్లీిలోని ఔట్‌లెట్ మాదిరిగానే బెంగళూరు స్టోర్ ఉండనుంది. ఈ స్థలాన్ని యాపిల్ 10 సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్టోర్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. భారత్ (India)లో వ్యాపార వృద్ధి ఇంకా భారీ అవకాశాలున్నాయని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ (Timkuk) తాజాగా వెల్లడిరచారు. ఇందుకు అనుగుణంగా దేశంలో నాలుగు రిటైల్ స్టోర్లు నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.