యాపిల్ సంచలన నిర్ణయం
ప్రముఖ స్మార్ట్ఫోన్ యాపిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబరులో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ల పూర్తిగా నిలిపివేయన్నుట్లు యాపిల్ వెల్లడించింది. ఐఫోన్-11 స్మార్ట్ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్ఈ 3తో నేరుగా పోటీపడటంతో ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్ఫోన్ లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్-11 ఐఫోన్ ఎస్ఈ 3 స్మార్ట్ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది.






