Apple: భారత్ నుంచే అమెరికాకు అధికంగా ఐఫోన్లు

అమెరికాలో జూన్ త్రైమాసికంలో విక్రయమయ్యే ఐఫోన్ల (iPhones)లో అధిక భాగం భారత్ నుంచే ఎగుమతి అవుతాయని యాపిల్ (Apple) సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) పేర్కొన్నారు. టారిఫ్‌ల ఇబ్బంది ఉన్నందున, చైనా (China)లో తయారయ్యే ఐఫోన్లను ఇతర మార్కెట్లకు తరలిస్తామని ఆయన తెలిపారు. అమెరికాలో ఏప్రిల్-జూన్‌లో అమ్ముడయే ఐఫోన్లలో అధిక భాగం భారత్‌లో తయారైనవే ఉంటాయి. ఐప్యాడ్, మ్యాక్, యాపిల్ వాచ్ (Apple Watch) , ఎయిర్‌పాడ్స్ వంటివి వియత్నాం నుంచి వస్తాయి. అమెరికా వెలుపల మొత్తం ఉత్పత్తుల విక్రయాల్లో చైనా నుంచి ఎగుమతి అయినవే ఎక్కువ ఉంటాయని కుక్ పేర్కొన్నారు.