అమెరికాలో నాట్కో ఫార్మాకు ఊరట

అమెరికాలో నాట్కో, దాని మార్కెటింగ్ పార్ట్‌నర్ బ్రేకెనరిడ్జ్‌పై దాఖలైన యాంటీ ట్రస్ట్ కేసులో నాట్కో దాని భాగస్వామి కంపెనీకి ఊరట లభించింది. ఈ రెండు కంపెనీలతో పాటు సెల్‌జీన్ కార్పొరేషన్ పై యాంటీ ట్రస్ట్ కేసును ఈ ఏడాది సెప్టెంబరులో లుసేనియా హెల్త్ సర్వీసెస్ అండ్ ఇండెమ్నిటీ కంపెనీ, బ్లూ షీల్డ్ ఆఫ్ లుసేనియా, హెచ్‌ఎంఓ లుసేనియా దాఖలు చేశాయి. పామలిడోమిడ్ (పామలిస్ట్) క్యాప్సుల్స్‌కు సంబంధించి ఈ కేసును దాఖలు చేశాయి. ఈ కేసు నుంచి నాట్కో, బ్రెకెన్‌రిడ్జ్‌లను లుసేనియా హెల్త్‌కేర్ సర్వీస్ తదితర సంస్థలు స్వచ్ఛందంగా తప్పించాయని నాట్కో వెల్లడించింది.