హైదరాబాద్‌లో క్లారిటీ బెనిఫిట్ సొల్యూషన్ ప్రారంభం

అమెరికాలోని పలు కంపెనీల జీవిత, ఆరోగ్య బీమా వ్యవహారాలతో పాటు ఇతర ప్రయోజనాలను పర్యవేక్షించే క్లారిటీ బెనిఫిట్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్నోబుల్ ఇండియాను స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్‌లో తమ అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ బిల్ కాటూజీ తెలిపారు. ప్రస్తుతం అమెరికాలోని సంస్థలకు సేవలు అందిస్తున్నామని, త్వరలోనే భారత్ సహా ఇతర ఆసియా, ఐరోపా దేశాలకు విస్తరించే ప్రణాళికలున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంలో 25 మంది నిపుణులుండగా, ఏడాదిలోగా వీరి సంఖ్య 100కు చేరుతుందన్నారు. రెండేళ్లలో 200 మంది నిపుణులు ఇక్కడి నుంచి పనిచేస్తారని పేర్కొన్నారు.