Mukesh Ambani : ముకేశ్ అంబానీ భారీ విరాళం

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తాను చదువుక్ను ముంబయి (Mumbai) లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి( ఐసీటీ) రూ.151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎం శర్మ (Professor MM Sharma) జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. 1970లో ఐసీటీ నుంచి ముకేశ్ గ్రాడ్యుయేషన్ (Graduation) పూర్తి చేసుకున్నారు. గతంలో దీన్ని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా (యూడీసీటీ) వ్యవహరించేవారు. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ (Dhirubhai Ambani) లానే దేశాన్ని పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని తపించేవారని పేర్కొన్నారు. ఆయనను గురు ఆఫ్ భారత్‌గా కొనియాడారు. ఆయన గురుదక్షిణగా ఐసీటీకి రూ.151 కోట్లు విరాళం (Donation) ఇస్తున్నట్లు అంబానీ ప్రకటించారు.