ట్విట్టర్‌కు ఎలన్ మస్క్ ఆఫర్

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్‌ను అమ్మితే తాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ అన్నారు. ఒక్కో షేర్‌ను 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ కమిషన్‌కు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌కు మస్క్ తెలిపారు. మొత్తంగా 4.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33 లక్షల కోట్లు) చెల్లిస్తానని తెలిపారు. ఇదే విషయమై ట్విట్టర్ సీఈవో బ్రెట్ టేలర్‌కు లేఖ రాసినట్లు వెల్లడిరచారు. ఇటీవలే ట్విటర్‌లో మస్క్ 9.2 శాతం వాటాను కొనుగోలు చేసి అతిపెద్ద వాటాదారుగా మారారు. ట్విట్టర్‌లో ప్రధాన వాటా కలిగిన ఉన్నప్పటికీ ఆ బోర్డు సభ్యుడిగా చేరడానికి ఇటీవల ఎలన్ విముఖత చూపారు.