ఎయిర్ ఇండియా శుభవార్త… త్వరలో వైఫై

టాటా గ్రూప్ నిర్వహణలోని ఎయిర్ ఇండియా ప్రయాణికులకు మరో అదనపు సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. తమ విమాన ప్రయాణికుల కోసం త్వరలో వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ముందుగా ఢిల్లీ నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి నడిచే ఎయిర్‌బస్ ఏ350 విమానాల్లో ఈ సదుపాయం ప్రవేశ పెడతామని తెలిపింది. తరువాత క్రమంగా ఈ సదుపాయాన్ని ఇతర విమాన సర్వీసులకు విస్తరిస్తారు.