డిసెంబర్ వరకు అమెరికా మార్గాల్లో .. 60 ఎయిర్ ఇండియా విమానాల రద్దు!

ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో భారత్`అమెరికా మార్గాల్లో నడిచే దాదాపు 60 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్వహణపరమైన ఇబ్బందుల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం. రద్దు ప్రభావం పడిన ప్రయాణికులకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని, అదే రోజు లేదా సమీప రోజుల్లో ఉన్న సర్వీసుల్లో ప్రయాణించే సౌలభ్యాన్ని వారికి కల్పించినట్లు కంపెనీ వివరించింది. నవంబరు 15 నుంచి డిసెంబర్ 31 వరకు మధ్య ఢిల్లీ-షికాగో మధ్య 14 విమానాలు, ఢిల్లీ-వాషింగ్టన్ మధ్య 28 విమానాలు, ఢిల్లీ-ఎస్‌ఎఫ్‌ఓ మధ్య 12, ముంబయి-న్యూయార్క్ మధ్య 4, ఢిల్లీ-నెవార్క్ మధ్య రెండు విమానాలు రద్దు అయినట్లు సంబంధిత వర్గాలు సమారం.