విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిరిండియా సేవలు

పలు కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రారంభించినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. కొత్త మార్గాల్లో విజయవాడ-బెంగళూరు, హైదరాబాద్-గువాహటి, బెంగళూరు-ఇందౌర్ ఉన్నాయి. అగర్తాలా నుంచి గువాహటి, కోల్‌కతాలకు కూడా విమాన సేవలను సంస్థ ప్రారంభించింది. అగర్తలా నుంచి వారానికి 14 విమాన సర్వీసులను కంపెనీ నిర్వహించనుంది.