బిల్‌గేట్స్ కు షాక్ ఇచ్చిన అదానీ
అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను ఆయన వెనక్కి నెట్టారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ కుబేరుల జాబితా ప్రకారం అదానీ సంపద 116.30 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.9,30,000 కోట్లు) కాగా, గేట్స్ సంపద విలువ 104.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,36,800 కోట్లు). గత 24 గంటల వ్యవధిలో అదానీ సంపద 337 మిలియన్ డాలర్ల మేర పెరిగింది. రెండేళ్లలో అదానీ గ్రూప్‌నకు చెందిన కొన్ని లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువ 600 శాతానికి పైగా పెరిగాయని, దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 25 శాతం వాటా కలిగిన 7 విమానాశ్రయాలు గత 3 ఏళ్లలోనే అదానీ పరం అయ్యాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అంబుజా సిమెంట్స్, ఏసీసీలో హోల్సిమ్ గ్రూప్ వాటాను 10.5 బి.డా.కు, ఇజ్రాయెల్‌లో నౌకాశ్రయం హైఫాను 1.18 బి.డా.కు కొనుగోలు చేశారు.






