Hindenburg : హిండెన్‌బర్గ్ మూసివేత .. మోదానీకి క్లీన్‌చిట్ కాదు : కాంగ్రెస్

అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ (Hindenburg )ను మూసివేస్తున్నంత మాత్రానా, ఆ సంస్థ చేసిన ఆరోపణల నుంచి ప్రధాని మోదీ(Modi), పారిశ్రామికవేత్త అదానీ (మోదానీ)కి క్లీన్‌చిట్ వచ్చినట్లు కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. కేవలం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు ద్వారా మాత్రమే మోదానీ అక్రమాలు బయటపడతాయని అన్నారు. దేశంలో పేదలు, మధ్యతరగతివారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మోదీ మిత్రులైన వ్యాపార, పారిశ్రామికవేత్తలు కోట్లకుపడగలెత్తుతున్నారని ఆయన ఆరోపించారు.