అరటి పండు రూ.10 కోట్లు!

ఓ అరటి పండును ప్లాస్టర్‌తో గోడపై అంటించారు. దీని విలువ అక్షరాల రూ.10 కోట్లు. ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే. మౌరీజియో కాట్టెలన్ అనే ఇటలీ ఆర్టిస్ట్ ఈ కళాఖండాన్ని 2019లో రూపొందించారు. వచ్చే నెల 20న ఈ అరటిపండును సోత్‌బై సంస్థ న్యూయార్క్‌లో వేలం వేయయనున్నది. రూ.10 కోట్లకు ఈజీగా అమ్ముడు పోతుందని సోత్‌బై సంస్థ నమ్మకంతో ఉన్నది. ఈ వేలాన్ని దక్కించుకున్న వారికి ఓ అరటిపండు, ఒక ప్లాస్టర్ ముక్క. సర్టిఫికేట్ ఇస్తారంట. వీటితో పాటు ఈ అరటిపండు ఎలా గోడపై నిలబెట్టాలో తెలిపే సూచనల ప్రమాణపత్రాన్ని కూడా ఇవ్వనున్నారంట. కొసమెరపు ఏంటంటే తాము ఇచ్చే అరటిపండ్లు, ప్లాస్టర్ కూడా అసలైనవి కావని సోత్‌బై సంస్థ వెల్లడించింది.