అమెరికాలో 5జీ సేవలు షురూ
అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ వెరైజెన్ టెలికాం సంస్థలు 5 జీ సేవలను ప్రారంభించాయి. అమెరికాలో 5 జీ సేవలు ప్రారంభించనున్నట్లు తెలియడంతో ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. అమెరికా వెళ్లాల్సిన పలు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. భారత్లోని ఎయిర్ ఇండియా సైతం అగ్రరాజ్యానికి వెళ్లాల్సిన కొన్ని విమానాలను నడపలేకపోతున్నామని ప్రకటించింది. 3.7-3.98 గిగాహెర్ట్ ఫ్రీకెన్సీ బ్యాండ్లలో 5జీ సేవల నిర్వహణకు గతేడాది ఫిబ్రవరిలో వెరైజన్, ఏటీ అండ్ టీ రూ.లక్షల కోట్ల విలువైన ఆర్డరు దక్కించుకున్నాయి. అమెరికాలో 5జీ సేవలు 2021 డిసెంబరు 5 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా సాధ్యపడలేదు.






