ASBL NSL Infratech

ఏపీ అభ్యర్థుల పేర్ల తో ఓటర్లు పరేషాన్..

ఏపీ అభ్యర్థుల పేర్ల తో ఓటర్లు పరేషాన్..

ఆంధ్రాలో నామినేషన్ల పర్వం ముగిసింది.. ఈరోజుతో నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా పూర్తవుతుంది. ఇక మిగిలింది మే 13న జరిగే ఎన్నికలే. అయితే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు అభ్యర్థుల పేర్లు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎన్నికలు అంటే చాలామంది పార్టీ గుర్తులు గుర్తు పెట్టుకుంటారు కానీ కొంతమంది పేర్లు గుర్తు పెట్టుకుంటారు. ఎవరి సౌలభ్యం మేరకు వాళ్లు ఫలానా వాళ్లకు ఓటేయాలి అని మైండ్లో ఫిక్స్ అవుతారు. అలా ఓటు వేయడానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్న పేర్లన్నీ ఒకే లాగా ఉంటే ఏం చేస్తారు? వినడానికి ఇంత కన్ఫ్యూజన్ గా ఉంది కదా.. నిజంగా ఇదే చాలా చోట్ల జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో ప్రధాన పార్టీలకు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకే నియోజకవర్గంలో దాదాపు ముగ్గురేసి చొప్పున ఒకే పేరుతో బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆంధ్రాలో కీలక పార్టీల పేర్ల పరేషాన్ ఓటర్లను సతాయిస్తోంది.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైసిపి తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలోకి దిగుతున్నారు. అదే నియోజకవర్గంలో అదే పేరుతో మరో ముగ్గురు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, బీసీవై నుంచి బోడె రామచంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి రామచంద్ర పోటీలో ఉన్నారు. గుడివాడ లో వైసీపీ తరఫున కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు బరిలో దిగుతుంటే.. స్వతంత్ర అభ్యర్థిగా కొడాలి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి పేర్లలో ఒక్క శ్రీ మాత్రమే మిస్సింగ్. తిరువూరు, ఎచ్చెర్లలో కూడా ఇదే పరిస్థితి.

ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పరిస్థితి అయితే చెప్పాల్సిన పనేలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్నారు. అప్పటి నుంచే అక్కడ సంచలనాలు నమోదు అవుతున్నాయి. వైసీపీ తరఫున పిఠాపురం అభ్యర్థిగా వంగా గీతా విశ్వనాథ్ బరిలోకి దిగుతుంటే..వంగీపురం గీత, వంగ‌ల గీతావిశ్వ‌నాథ్ మరో ఇద్దరు మహిళా అభ్యర్థులు స్వ‌తంత్రులుగా  పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరుతో కూడా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండడం పిఠాపురం స్పెషాలిటీ. దీంతో పిఠాపురంలో ఓట్లు ఎటువైపు పడతాయో అన్న టెన్షన్ గట్టిగా కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :