హిందూపుర్ హ్యాట్రిక్.. బాలయ్య టార్గెట్ సాధ్యమేనా?
సినీ ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాలకృష్ణ. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రికి ప్రతి విషయంలో అండగా నిలిచిన బాలకృష్ణ ఏనాడు ప్రత్యక్షంగా రాజకీయంలో అడుగుపెట్టింది లేదు. తన తండ్రి, అన్న గెలిచిన హిందూపూర్ నుంచి 2014,2019 ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. 2019 జగన్ వేవ్ బలంగా వీచినప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి టీడీపీ గెలిచిన రెండు సీట్లలో బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం సీటు ఒకటి కావడం విశేషం.
ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం బరిలోకి దిగిన బాలయ్య పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇది కేవలం అయిన మీద ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు.. ప్రతిపక్షంలో జరుగుతున్న అంతర్గత పోరు మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. వైసీపీ వర్గ పోరు.. బాలయ్య విజయానికి శ్రీరామరక్ష అని అందరికీ తెలుసు. ఈసారి అక్కడ నుంచి ఇండిపెండెంట్గా స్వామీజీ పరిపూర్ణానంద పోటీ చేశారు. ప్రస్తుతానికి ఆయన ప్రభావం ఎలా ఉంది అన్న విషయం తెలియదు కానీ.. బాలకృష్ణ విజయం మాత్రం పక్కా అని టాక్ నడుస్తోంది. 1983 నుంచి తీసుకుంటే ఇది హిందూపూర్ లో జరుగుతున్న పదవ ఎన్నికలు.. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మూడుసార్లు గెలిచారు.. హరికృష్ణ ఒకసారి గెలిచారు.. బాలకృష్ణ రెండు సార్లు గెలిచి మూడవసారి హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి బాలయ్య బాబు ఖాతాలో హ్యాట్రిక్ పడితే హిందూపూర్ నియోజకవర్గంలో వరుసగా ఏడుసార్లు ఘనవిజయం సాధించిన ఘనత నందమూరి కుటుంబానికి చెందుతుంది. అందుకే ఈసారి బాలయ్య కుమార్తెలతో పాటు ఆయన సతీమణి కూడా హిందూపుర్ లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.