ASBL NSL Infratech

నాగ్‌తో మ‌ల్టీస్టార‌ర్‌కు ఇంట్రెస్ట్ చూపించ‌ని అఖిల్

నాగ్‌తో మ‌ల్టీస్టార‌ర్‌కు ఇంట్రెస్ట్ చూపించ‌ని అఖిల్

టాలీవుడ్ లో హీరోలంద‌రూ వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తుంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు మాత్రం ఇంకా వెనుక‌బ‌డే ఉన్నారు. నాగ‌చైత‌న్య ఒక్క‌డే రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా సినిమా త‌ర్వాత సినిమా చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య తండేల్ సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే మంచి బ‌జ్ ఉంది.

నాగార్జున ఈ సంక్రాంతికి నా సామిరంగ‌తో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా హిట్ ఇచ్చిన కిక్ తో నాగ్ వ‌రుస సినిమాలు ప్లాన్ చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం నాగ్ ధ‌నుష్ తో క‌లిసి కుబేర సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ తో కూడా క‌లిసి న‌టిస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. కానీ అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం త‌న కెరీర్ ను న‌త్త న‌డ‌క‌న సాగిస్తున్నాడు.

ఏజెంట్ తో డిజాస్ట‌ర్ అందుకున్న అఖిల్ త‌ర్వాతి సినిమా ఏంట‌నేది ఇప్ప‌టికీ అంతుచిక్క‌డం లేదు. రీసెంట్ గా నాగ్, అఖిల్ కాంబోలో మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ రానుంద‌ని వార్త‌లొచ్చాయి. స్టోరీ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయింద‌న్నారు. కానీ ఆ సినిమా చేసేందుకు అఖిల్ నో చెప్పాడ‌ని టాక్. అందుకే నాగ్ కూడా ప్ర‌స్తుతానికి ఆ ప్రాజెక్ట్ ను ప‌క్క‌న పెట్టాడ‌ట‌. అఖిల్ కెరీర్ ను సెట్ చేద్దామ‌ని నాగ్ ఎంత‌గా అనుకున్నా అఖిల్ మాత్రం త‌న‌కు న‌చ్చిన సినిమాలే చేయాల‌ని ఫిక్స్ అవ‌డంతో నాగ్ అఖిల్ సినిమాల విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం లేదని తెలుస్తోంది. సోలోగా హిట్ కొట్టాకే తండ్రితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట అఖిల్. మ‌రి అదెప్ప‌టికి సాధ్య‌మవుతుందో చూడాలి.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :