ASBL NSL Infratech

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు: సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు: సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో 6, 7 స్థానాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో గెలవబోతోందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బీజేపీకి పని చేశాయని, బీజేపీ గెలుపుకోసమే పాటుపడ్డాయని ఆరోపించారు. అయినా కాంగ్రెస్ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, కనీసం 9 నుంచి 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ఎన్నికలు పూర్తి కావడంతో ఇక రేపటి నుండి పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పిన ఆయన.. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్న బియ్యంపై ఫోకస్ పెడతానని హామీ ఇచ్చారు. అలాగే రుణమాఫీ చేయడం కోసం ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ‘‘ముందుగా వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. దానికి ఆదాయాన్ని సమకూరుస్తాం. ఆ తర్వాత ఆ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’ అని రేవంత్ భరోసా ఇచ్చారు. కాగా.. ఈ నెల 6 నాటికి రైతు బంధు పూర్తిగా ఇచ్చేశామని తెలిపిన రేవంత్.. రేషన్ దుకాణాల్లో ఎక్కువ వస్తువులను తక్కువ ధరకు ఇస్తామని హామీ ఇచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :