Donald Trump: రెండోదశ ఆంక్షలు సిద్ధం : డొనాల్డ్ ట్రంప్

రష్యా కు వ్యతిరేకంగా రెండోదశ ఆంక్షలను విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. మాస్కో (Moscow) నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలకు వీటి సెగ తగలొచ్చని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ (Ukraine) పై అతిపెద్ద దాడి చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ ప్రభుత్వ కాంప్లెక్స్‌ను మాస్కో దళాలు ధ్వంసం చేశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై అమెరికా ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తి ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తోంది.