Donald Trump : డొనాల్డ్ ట్రంప్ చర్యలపై .. స్వదేశంలో వ్యతిరేకత

రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో భారత్ (India) పై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఇదే అంశంలో చైనా (China)ను ఉపేక్షించడంపై స్వదేశంలోనూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తీరును విపక్ష డెమోక్రాట్ (Democrat) లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్‌పై భారీ మొత్తంలో సుంకాలు విధించడం సమంజసం కాదని డెమోక్రాట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఆక్షేపించింది. చైనా కూడా మాస్కో నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును కొనుగోలు చేస్తోందని, ఆ దేశంపై అమెరికా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ట్రంప్‌ను ప్రశ్నించింది. అధ్యక్షుడిగి నిర్ణయం అమెరికా ప్రజలను కూడా భాదిస్తోందని తెలిపింది.