National Guard : నేషనల్ గార్డ్ మోహరింపుతో చట్టాన్ని ఉల్లంఘించిన ట్రంప్ సర్కారు

అక్రమ వలసల నివారణ పేరుతో డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యంత్రాంగం చేపట్టిన దాడులకు వ్యతిరేకంగా గత జూన్‌లో జరిగిన నిరసనల్ని నియంత్రించేందుకు నేషనల్ గార్డ్ (National Guard) బలగాలను ఉపయోగించడాన్ని అమెరికా కోర్టు తప్పుబట్టింది. లాస్‌ఏంజెల్‌స్ ప్రాంతానికి నేషనల్ గార్డ్ బలగాలను పంపడం ద్వారా డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘిచిందని ఫెడరల్ న్యాయమూర్తి ఛార్లెస్ బ్రెయెర్ (Charles Breyer ) అన్నారు. పౌర చట్టాల అమలుకు సైన్యాన్ని వినియోగించరాదన్న నిబంధనను డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఉల్లంఘించిందని కాలిఫోర్నియా ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై ఫెడరల్ కోర్టు (Federal Court) ఈ తీర్పు వెలువరించింది.