Donald Trump : ఈ పేరు నాకు నచ్చలేదు … ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మరోసారి చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా రక్షణ శాఖ (Department of Defense) పేరు తనకు నచ్చలేదన్నారు శ్వేతసౌధంలో దక్షిణ కొరియా అధ్యక్షుడి (South Korean President) తో భేటీ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రక్షణ శాఖ ఈ పేరు నాకు నచ్చలేదు. దేన్నుంచి మనం రక్షించుకోవాలి? ఎందుకు రక్షించుకోవాలి? మొదట్లో దీనిని యుద్ధ శాఖగా పిలిచేవారు. అది బాగుండేది. మనకు రక్షించుకోవడం మాత్రమే కాదు, దూకుడుగా ఉండటం కూడా కావాలి అని పేర్కొన్నారు. మనకన్నా ఎక్కువగా రష్యా (Russia) చమురు కొంటున్న చైనా విషయంలో మాత్రం భిన్నమైన వైఖరి అవలంబిస్తున్నారు. చైనాతో అమెరికా గొప్ప బంధం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.






