Donald Trump: ఆ దేశానికి మరో 3,350 క్షిపణులు : డొనాల్డ్ ట్రంప్

ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350లకు పైగా ఎక్స్‌టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనికేషన్ (ఈఆర్‌ఏఎమ్) క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ ఆయుధ ప్యాకేజీకి ఐరోపా (Europe) దేశాలు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్‌కు చేరుకుంటాయని సమాచారం. అయితే 240 కి.మీ. నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈఆర్‌ఏఎమ్ (ERAM) క్షిపణులను రష్యా (Russia)పైకి ప్రయోగించాలంటే ఉక్రెయిన్ (Ukraine) పెంటగాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలను సరఫరా చేసే విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.