Kamala Harris: కమలా హారిస్‌కు సీక్రెట్ సర్వీస్ రక్షణ తొలగింపు

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) కు కల్పిస్తున్న సీక్రెట్ సర్వీస్ రక్షణను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రద్దు చేసినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వారికి, పదవి నుంచి వైదొలిగిన తరువాత కూడా జీవితాంతం సమాఖ్య ప్రభుత్వ రక్షణ ఉంటుంది. కానీ ఉపాధ్యక్షులకు మాత్రం పదవీ విరమణ చేసిన తరువాత 6 నెలల వరకు మాత్రమే ఈ రక్షణ ఉంటుంది. అయితే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) అధికారంలో ఉన్నప్పుడు కమలా హారిస్‌కు సీక్రెట్ సర్వీస్ (Secret Service) రక్షణను 18 నెలల కాలానికి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు మరో అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఆ దేశాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.