Visa : అమెరికాలో 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

అమెరికాలో ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా (Visa) పత్రాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం పేర్కొంది. ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది. నేరాలు (Crimes), ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్రసంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికా (America)లో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది.