Trump orders: ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు అమెరికాకు ప్రమాద సంకేతాలేనా..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ఇష్టమున్నా.. ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు.. ఆయన గెలవకూడదని శతవిధాలా ప్రయత్నించారు. కానీ .. ట్రంప్ ప్రచారశైలి ముందు వారు నెగ్గలేకపోయారు. అయితే వారు భయపడినంతా జరుగుతోంది. ఏక బిగిన డజన్లకొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చిన ట్రంప్.. ఇందులో అత్యంత కీలకమైన బర్త్ సిటిజన్ షిప్ ను రద్దు చేశారు. అయితే ఇందులో కూడా వలసలు, బర్త్ సిటిజన్ షిప్ ను ఒకే కోణంలోంచి ట్రంప్ చూస్తున్నారు. ఈ పరిణామం అమెరికాపై ఆశలు పెట్టుకున్న వలసజీవులకు ఆశనిపాతమైంది.
అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, అసలు వలసలపైనే ప్రభావం చూపించేలా.. నిర్ణయం తీసుకోవడం, బై బర్త్ గ్రీన్ కార్డు ఫెసిలిటీని ఎత్తేయడం.. వంటివి ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. ప్రధానంగా భారత్, చైనా, మెక్సికో సహా అనేక దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఒక్క మెక్సికో(Mexico) నుంచి మాత్రమే అక్రమ వలసలు జరుగుతున్నాయన్నది వాస్తవం. ఇక్కడ అడ్డుకట్ట వేసేందుకే ఇదే ట్రంప్ గతంలో మెక్సికో చుట్టూ గోడ కట్టించారు.
దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. ఖజానా ఖాళీ అవుతున్నా అప్పట్లో ట్రంప్ పట్టించుకోలేదు. అయినప్పటికీ.. వలసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు మొత్తానికే ఎసరుపెడుతూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇలా వలసలను, బై బర్త్ సిటిజన్ షిప్‌ను నిలిపి వేయడం వల్ల దేశం ఆర్థికంగా(EconomicallY) ఇబ్బంది పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే అమెరికాకు ఇమ్మిగ్రేషన్ ఆదాయం ఎక్కువ. ఇతర ఆదాయాలకంటే ఎక్కువగా వస్తోంది. ఇప్పుడు దీనిపై ప్రభావం చూపించేలా నిర్ణయం తీసుకుంటే అది మరింత నష్టం” అని ఆర్థిక నిపుణుడు రిచర్డ్IRichord) హెచ్చరించారు.
కాగా.. అమెరికాకు ఏటా వివిధ రూపాల్లో వచ్చే ఆదాయంలో వీసాలు, ఇమ్మిగ్రేషన్ (Immigration)డిపార్ట్ మెంట్ ద్వారా 28 శాతం ఆదాయం సమకూరుతోంది. ఇది కీలకమైన ఐటీ, పారిశ్రామిక రంగాలతో పోల్చుకుంటే 2 శాతం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. పైగా.. దీనివల్ల నష్టం లేదని కూడా అంటున్నారు. ఇదేసమయంలో అక్రమ వలసలపై ఆందోళన ఉందని చెబుతున్నారు. దీనిని నిలుపుదల చేసేందుకు ఇలాంటి నిర్ణయం సరికాదంటున్నారు.
మరోవైపు భారత ఆర్థిక నిపుణులు కూడా.. ట్రంప్ నిర్ణయం అమెరికాను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెడుతుందని పేర్కొంటూ.. గతంలో కరోనా సమయంలో ట్రంప్ వ్యవహరించిన తీరును వారు ప్రస్తావిస్తున్నారు. అప్పట్లోనూ మొండిగా వ్యవహరించి.. కరోనా దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేశారని వారు చెబుతున్నారు. దీనివల్ల అమెరికా ఆదాయం తగ్గే ప్రమాదముందని చెబుతున్నారు. మరి దీన్ని ట్రంప్ ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.