Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్ డీసీలో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై స్వదేశంలో నిరసన గళం వెల్లువెత్తింది. దేశ రాజధాని నగర వీధుల్లో ఫెడరల్ (Federal) దళాలను మోహరించడాన్ని వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ డీసీ (Washington, DC) లో అనేక వేల మంది రోడ్డెక్కారు. తక్షణమే నేషనల్ గార్డుల మోహరింపును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నగరంలో నేరాలు పెచ్చుమీరుతున్నాయంటూ గత నెలలో ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ దళాలను మోహరించారు. మెట్రోపాలిటన్ పోలీసు విభాగాన్ని కూడా నేరుగా ఫెడరల్ నియంత్రణలోకి తీసుకొచ్చారు. దీన్ని ఫెడరల్ ప్రభుత్వ అతిక్రమణ చర్యగా ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. ట్రంప్ తక్షణమే వెళ్లిపోవాలి, డీసీకి స్వేచ్ఛ కల్పించాలి, నిరంకుశత్వాన్ని ప్రతిఘటించండి తదితర పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు.