నా బెస్ట్ ఫ్రెండ్ ట్రంప్ కు విషెస్..
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి కోసం, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దామని పేర్కొన్నారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ‘హౌడీ, మోడీ!’, ‘నమోస్తే మోదీ’ లాంటి కార్యక్రమాల్లో మోదీతో పాటు ట్రంప్ కూడా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనలో భారత్-అమెరికా సంబంధాలు మంచిగానే కొనసాగాయి. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.






