Donald Trump : నేను ఆ కార్డ్స్ ఆడితే .. చైనాకు వినాశనమే : ట్రంప్ వార్నింగ్

చైనాతో వాణిజ్యయుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ (Beijing) తో తాము గొప్ప సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, చైనా కంటే తమ ఆధిపత్యమే ఎక్కువన్నారు. ఈ విషయంలో పోటీకొస్తే బీజింగ్‌కు వినాశనం తప్పదని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. ఈ ఏడాది చివర్లో లేదా ఆ తర్వాత కొంతకాలానికి నేను చైనా (China) పర్యటనకు వెళ్తా. ఇరుదేశాల మధ్య అద్భుత సంబంధాలు ఉండబోతున్నాయి. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య విభేదాల్లో బీజింగ్ కంటే వాషింగ్టన్ (Washington) బలంగా ఉంది. వాళ్ల ( చైనాను ఉద్దేశిస్తూ) వద్ద కొన్ని కార్డులు ఉన్నాయి. మా వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయి. కానీ, వాటితో నేను ఆడాలనుకోవట్లేదు. ఒకవేళ ఆడితే చైనా నాశం అవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆ కార్డులు నేను ఆడను అని ట్రంప్ వెల్లడిరచారు.