Donald Trump: ఇప్పుడున్నంత ఆరోగ్యంగా మునుపెన్నడూ లేను :డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనారోగ్య వార్తలు సోషల్ మీడియా (social media) లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో మిస్సింగ్ (missing) అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టలకే తన ఆరోగ్యంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్ (Better)గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్ మీడియా వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.