జో బైడెన్ కు షాక్ .. వలస విధానాన్ని కొట్టేసిన జడ్జి
అమెరికా పౌరులను వివాహం చేసుకున్న తగిన పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించి అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం తీసుకొచ్చిన వలస విధానాన్ని సమాఖ్య న్యాయమూర్తి ఒకరు కొట్టివేశారు. ఈ విధానానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. దీనికింద సుమారు 5 లక్షల మంది వలసదారులు లబ్ధిపొందుతారని భావించారు. అయితే ఈ విధానంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన టెక్సాస్‌కు చెందిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జె.కేంప్బెల్ బార్కెర్ ఆగస్టులో తీర్పును వాయిదా వేశారు. తాజాగా తీర్పిస్తూ వలస విధానాన్ని అమలు చేయడం ద్వారా బైడెన్ యంత్రాంగం తన అధికార పరిధిని అతిక్రమించిందన్నారు.






