Trump: ట్రంప్ వర్సెస్ న్యాయస్థానాలు..

బర్త్ సిటిజన్ షిప్ రద్దు విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నంత ఈజీ కానట్లు తెలుస్తోంది. ట్రంప్ తన ఎగ్జిక్యూటివ్ పవర్స్ వాడినప్పటికీ… ఫెడరల్ కోర్టు మాత్రం నిలిపేసింది. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేశారు.ఇది.. లక్షల మంది జీవితాలతో ఇది ముడిపడి ఉన్నందున.. పూర్తిస్థాయిలో విచారణ జరిపేవరకూ .. ఈ చట్టం రద్దును నిలిపివేసింది కోర్టు.
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ (Birthright citizenship) రద్దు ఒకటి. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారి పాలనలో ఉన్న వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఓరెగన్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం.. పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి.
వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేశారు. ఈ ఆదేశాలను తాత్కాలికంగా సియాటిల్ ఫెడరల్ కోర్టు నిలిపివేసింది. దీనిపై ట్రంప్ స్పందించారు. తాము అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే ఇది అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు.
ఎందుకంటే ఇది లక్షల జీవితాలతో ముడిపడిన అంశం… ఇప్పటికే చాలా మంది దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. వారిలో చాలా మంది పిల్లలు డిగ్రీలు,పీజీలు కూడా చదివేశారు. మరికొందరేమో..ఉద్యోగాల్లో సైతం ఉన్నారు. వీరికే ఇప్పుడు బర్త్ సిటిజన్ షిప్ లేకుంటే.. వారి తల్లితండ్రులు, ఇతరత్రా వారి పరిస్థితి సందిగ్ధంలో పడుతుంది. మరోవైపు..ఇది అమెరికాకు కూడా ఇబ్బందికర పరిణామమే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.