J.D. Vance : రష్యాపై ఒత్తిడికే భారత్ మీద సుంకాలు : వాన్స్

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేసేలా రష్యా (Russia) పై ఒత్తిడి తెచ్చేందుకే భారత్‌పై తాము అధిక సుంకాలు వేస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (J.D. Vance) తెలిపారు. చమురు విక్రయం ద్వారా వచ్చిన డబ్బుతో ధనిక దేశంగా మారకుండా రష్యాకు అడ్డంకులు కల్పించడం తమ ఉద్దేశమని తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ (Ukraine) యుద్ధానికి అడ్డుకట్టపడేలా చేయడంలో అమెరికా (America) మధ్యవర్తిత్వం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల నుంచి ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు అందుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌లో నరమేధాన్ని ఆపితే రష్యాను తిరిగి ప్రపంచ ఆర్థిక రంగంలోకి ఆహ్వానిస్తామనే సంకేతాలను డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పంపించారని చెప్పారు.