JD Vance: వెనిజులాపై సైనిక చర్య మంచిదే : జెడి వాన్స్

వెనిజులాపై సైనిక చర్యకు పాల్పడటం మంచిదేనని అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ (JD Vance) స్పష్టం చేశారు. వెనిజులా (Venezuela) డ్రగ్స్ నౌకపై అమెరికా సైనిక చర్యను ఆయన సమర్థించారు. అయితే అమెరికా (America) చర్యపై ప్రపంచదేశాలనుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ట్రంప్ (Trump) అధికార యంత్రాంగం అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించిందని , ఏకంగా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని స్పందనలు వెలువడ్డాయి. అమెరికా చర్యలో 11 మంది చనిపోయారు. మినియాపోలిస్ సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వాన్స్ మాట్లాడారు. వెనుజులా దారుణంతో పోలిస్తే తాము చేసింది తక్కువే అని వ్యాఖ్యానించారు. తమ దేశ పౌరులను డ్రగ్స్ (Drugs) ద్వారా విషపూరితులు చేస్తున్న వారికి తమ సైనికులు తగు శిక్షనే విధించారని చెప్పారు.ఇది తమ సైన్యం ద్వారా చేపట్టిన అత్యున్నత, ఉత్తమ చర్య అని సమర్థించారు.