US Congress: భగవద్గీతపై ప్రమాణస్వీకారం చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం

భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు సుహాస్ సుబ్రమణ్యం ..భగవద్గీత(Bhagvadgita)పై ప్రమాణస్వీకారం చేశారు. ఈస్ట్ కోస్ట్ నుంచి తొలి భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన కుమారుడు సుహాస్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయడాన్ని తల్లి స్వయంగా వీక్షించారు.”వర్జీనియా(virginia) నుంచి తొలి భారతీయ అమెరికన్, దక్షిణాసియా కాంగ్రెస్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నా తల్లిదండ్రులు చూశారు’ అని సుబ్రమణ్య ప్రమాణ స్వీకారం అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ లో వర్జీనియా 10వ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొదటి ఇండో అమెరికన్ కావడం గర్వంగా ఉందన్నారు. తన గెలుపు.. ఈప్రాంతం నుంచి చాలా మంది పాలిటిక్స్ లోకి రావడానికి స్పూర్తిదాయకంగా ఉంటుందన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మాజీ విధాన సలహాదారు అయిన ఆయన 2019లో తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి వర్జీనియా జనరల్ అసెంబ్లీలో పనిచేశారు. రిచ్మండ్లో, సుబ్రమణ్యం ద్వైపాక్షిక “కామన్వెల్త్ కాకస్”(common wealth caucas) ను స్థాపించారు.
అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందూ-అమెరికన్ తులసి గబ్బార్డ్ (43)(tulasi gabbard) గీతపై ప్రమాణ స్వీకారం చేశారు. 2013 జనవరి 3న హవాయిలోని రెండో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహించి ప్రతినిధుల సభలో సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.యుక్తవయసులోనే హిందూ మతంలోకి మారిన గబ్బార్డ్ ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పదవికి నామినీగా ఉన్నారు.
119వ కాంగ్రెస్ లో నలుగురు హిందూ శాసనసభ్యులు ఉన్నారు. మిగతా ముగ్గురు రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, శ్రీ థానేదార్. అమెరికా కాంగ్రెస్ లో హిందువులు, ముస్లింలు మూడో అతిపెద్ద మత సమూహం. 461 మంది సభ్యులతో క్రైస్తవులు, 32 మంది సభ్యులతో యూదులు అతిపెద్ద మత సమూహంగా ఉన్నారు. ముగ్గురు బౌద్ధ సభ్యులు కూడా ఉన్నారు. ఓ రీసెర్చ్ ప్కరాకం 2025-27 కాంగ్రెస్ సెషన్ లో సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో మొత్తం ఓటింగ్ సభ్యులలో క్రైస్తవులు 87 శాతం ఉన్నారు. గత సెషన్లో 88 శాతం, దశాబ్దం క్రితం 92 శాతంతో పోలిస్తే ఇది తగ్గింది.