Peter Navarro: రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే : పీటర్ నవారో

రష్యాతో భారత్ దోస్తీపై తరచూ తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో (Peter Navarro)మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ప్రధాని మోదీ అవకాశవాదంతో పుతిన్, జిన్‌పింగ్ (Jinping) లతో సఖ్యత పెంచుకుంటున్నారని, ఇది సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. భారత్ ఉండాల్సింది రష్యా (Russia) తో కాదని, అమెరికాతో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మోదీ (Modi) త్వరలోనే గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.