Donald Trump:ఆ డీల్ పూర్తి చేస్తే స్వర్గానికే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia), ఉక్రెయిన్ (Ukraine ) దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరి, యుద్ధాన్ని ఆపగలిగితే తాను స్వర్గానికి వెళతానని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నా పాలన సరిగా లేదనడం వింటున్నారు. కానీ, ఆ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం స్వర్గానికి వెళతాను అని అన్నారు. ఎన్నికల (Election) సమయంలో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నప్పటి నుంచి ట్రంప్‌లో ఆధ్యాత్మిక భావన పెరిగిందన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.