FBI : ట్రంప్ మాజీ సలహాదారుపై ఎఫ్‌బీఐ దాడులు

భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను ఖండించినవాళ్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ల ఇంటిపై విదేశీ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ )ను మోహరిస్తున్నారు ట్రంప్. భారత్ (India) పై 50 శాతం సుంకాల భారాన్ని తప్పుపట్టినందుకు మాజీ సలహాదారు జాన్ బొల్టన్ (John Bolton)ను సైతం వదల్లేదు అమెరికా ప్రెసిడెంట్. బోల్టన్ సుంకాలను విమర్శించిన మరుసటి రోజునే ఎఫ్‌బీఐ అధికారులు ఆయన ఇంట్లో సోదాలకు వచ్చారు. అయితే, కొన్ని ముఖ్యమైన దస్త్రాల కోసమే ఎఫ్‌బీఐ దాడులు చేసింది. ఇప్పటివరకైతే బోల్టన్‌ను అరెస్ట్ (Arrest) చేయలేదు. ఆయనపై ఎలాంటి కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం లేదు.