America: ఉక్రెయిన్‌కు భద్రత కల్పిస్తాం : అమెరికా

ఉక్రెయిన్ గడ్డపైకి తమ సైన్యాన్ని పంపేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లివిట్ (Caroline Leavitt) వెల్లడిరచారు. గగనతలం లేదా ఇతర మార్గాల్లో సాయమందించే విషయం కాదనలేమని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ (Ukraine )కు అమెరికా గగనతల రక్షణ కల్పిస్తుందా? అని ప్రశ్నించగా, అందుకు అవకాశం ఉందని కరోలిన్ లివిట్ బదులిచ్చారు. ఉక్రెయిన్ భద్రత కోసం ఏవిధమైన సైనిక సహాయాన్ని అందించాలనే అంశం అమెరికా (America) అధ్యక్షుని పరిధిలోని విషయమని ఆమె అన్నారు. కచ్చితంగా చెప్పలేమన్నారు. ఐరోపాలోని మిత్రదేశాల సమన్వయంతో ఉక్రెయిన్‌కు తగిన భద్రతను కల్పిస్తామని ఆమె తెలిపారు.