Richard Woolf: భారత ఏనుగును అమెరికా ఎలుక ఢోకొన్నట్టే ..అమెరికా ఆర్థికవేత్త కీలక వ్యాఖ్యలు

భారత్‌పై అమెరికా అడ్డగోలుగా సుంకాలు విధించడాన్ని ఆ దేశ ఆర్థికవేత్త రిచర్డ్ వూల్ఫ్ (Richard Woolf) తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్ అతి పెద్ద మార్కెట్ అని, అలాంటి దేశంతో అమెరికా తీరు ఏనుగు (Elephant) ను ఎలుక ఢీకొట్టినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ (India) విషయంలో అమెరికా చాలా కఠినంగా ఉన్నట్టు వ్యవహరిస్తోంది. భారత్‌వైపు తుపాకీ గురిపెట్టానని అనుకుంటూ, తన కాలిని తానే కాల్చుకుంటోంది. ఉక్రెయిన్ (Ukraine) తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తే, రష్యా కొత్త మార్కెట్లను వెతుక్కుంది. ఇప్పుడు అమెరికా సుంకాలతో భారత సరుకులను అడ్డుకుంటే, భారత్ ఆ సరుకులను బ్రిక్స్ కూటమికి అమ్ముకుంటుంది. దీనితో బ్రిక్స్ (Bricks) కూటమి బలోపేతం అవుతుంది. పశ్చిమ దేశాలకు ఆర్థిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది. భారత్‌పై అడ్డగోలు సుంకాలతో ఒక రకంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయే బలోపేతం చేస్తోంది అని పేర్కొన్నారు.