న్యూయార్క్ గుడ్ సమరిటన్ హాస్పిటల్ లో తానా సేవా కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కోవిడ్ 19 పేషంట్లకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని అభినందిస్తూ వివిధ చోట్ల వారిని ప్రశంసిస్తూ లంచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్లోని గుడ్ సమరిటన్ హాస్పిటల్ సిబ్బంది సేవలను అభినందిస్తూ వారికి లంచ్ కార్యక్రమాన్ని తానా న్యూయార్క్ టీమ్ నిర్వహించింది. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా రీజినల్ కో ఆర్డినేటర్ సుమంత్‍రామ్ తెలిపారు.