Mukesh Ambani:మళ్లీ ముకేశ్ అంబానీనే నంబర్ వన్

ముకేశ్ అంబానీ (Mukesh Ambani) హవా కొనసాగుతున్నది. ప్రస్తుత నెలకుగాను ఫోర్బ్స్ మ్యాగజైన్ (Forbes Magazine) దేశీయ శ్రీమంతుల జాబితాను విడుదల చేసింది. దీంట్లో ముకేశ్ అంబానీ 115 బిలియన్ డాలర్ల సంపదతో తొలిస్థానంలో నిలిచారు. 67.0 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదానీ (Gautam Adani) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. వీరితోపాటు శివ్ నాడార్ 38 బిలియన్ డాలర్లతో ఆ తర్వాతి స్థానం దక్కించుకున్నారు. 37.4 బిలియన్ డాలర్లతో సావిత్రి జిందాల్ కుటుంబానికి నాలుగోస్థానం దక్కింది.