ఈ మాస్కు ధర 4 లక్షలు!

కరోనా కాలంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఓ వరుడికి వింత కోరిక పుట్టింది. లాక్‍డౌన్ నిబంధనల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగినా తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా లక్షల రూపాయులు ఖర్చు చేసి తనకు, కాబోయే భార్య కోసం ఓ షాపులో వజ్రాల మాస్కు తయారు చేయించుకున్నాడు. ఈ ఘటన గుజరాత్‍లోని సూరత్‍లో చోటుచేసుకుంది. ఇక పెళ్లి కొడుకు కోరి మేరకు తమ డిజైనర్లు రూపొందించిన మాస్కులకు మంచి డిమాండ్ ఏర్పడిందని, దీంతో మరిన్ని వజ్రాల మాస్కులను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు ఆభరణాల వ్యాపారి దీపక్ చోక్సీ తెలిపారు. లక్షన్నర నుంచి 4 లక్షల రూపాయల ఖర్చు పెడితే బంగారు, వజ్రాల మేళవింపుతో కూడిన మాస్కులను అందిస్తామని చెబుతున్నారు.