ఫ్లాష్ ఛార్జ్, ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ మరియు VOOC ఛార్జర్లను విడుదల చేసిన ఒప్పో

ఒప్పో నేడు 125W ఫ్లాష్ ఛార్జ్, 65 W ఎయిర్VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్, అల్ర్టా-స్మాల్ పోర్టబుల్ 50 W మినీ సూపర్VOOC వైర్‌లెస్ ఛార్జర్లతో పాటు 110 మినీ ఫ్లాష్ ఛార్జర్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ 125 W ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికత మొబైల్ ఫోన్ పరిశ్రమకు అత్యాధునిక ఫ్లాష్ ఛార్జ్ ఇంజినీరింగ్ ఉపకరణంగా అందుబాటులోకి వస్తోంది. మెరుగుపరచిన ఎన్‌క్రిప్షన్ ఆల్గారిథం మరియు కఠిన ఉష్ణోగ్రత నియంత్రణ రెగ్యులేటర్లలో ఇది ఫ్లాష్ ఛార్జింగ్ ఉపకరణం సురక్షిత మరియు దక్షతతో వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ 65W ఎయిర్VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ వినియోగదారులకు వైర్డ్ ఛార్జింగ్ కన్నా వేగంగా ఛార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ 50 W మినీ సూపర్VOOC ఛార్జర్ మరియు 110 W ఫ్లాష్ ఛార్జర్ ఒప్పో అందుబాటులోకి తీసుకు వచ్చిన VOOC ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికతలో మొదటిసారిగా పరిచయం చేస్తోంది. అవి రెండే తేలికగా, పల్చగా మరియు కావలసిన చోటుకు తీసుకు వెళ్లగలిగిన గుణాలతో ఎక్కువ శక్తివంతమైన ఛార్జర్లను చిన్నవాటిగా చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాయి.
ఒప్పో చీఫ్ ఛార్జింగ్ టెక్నాలజీ సైంటిస్ట్ జెఫ్ చాంగ్ మాట్లాడుతూ ‘‘ ప్రపంచ వ్యాప్తంగా 5జి సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యోం ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే అప్లికేషన్లయిన గేమింగ్ మరియు వీడియో వీక్షణలతో మొబైల్ ఫోన్ల బ్యాటరీ లైఫ్‌లో మరియు వినియోగదారుల ఛార్జింగ్ అనుభవంలో సరికొత్త సవాళ్లను తీసుకు రానుంది. ఒప్పో ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవంలో 2014లో VOOC ఫ్లాష్ ఛార్జ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చినప్పటి నుంచి ముందంజలో కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు మేము ఉన్నత శక్తి, వైర్‌లెస్ మరియు అత్యంత చిన్నదైన ఛార్జింగ్ సాంకేతికతల్లో పరిణితిని మరియు అనుకూలతలను అందుబాటులోకి తీసుకు రావడాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు సురక్షితను, దక్షతను మరియు అనుకూలమైన అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తున్నామని’’ వివరించారు.
ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు మరియు ఆర్ & డి విభాగాధిపతి తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ ‘‘ఒప్పో గ్లోబల్ సాంకేతిక ఆవిష్కర్తగా స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో పలు ‘‘మొట్టమొదటి’’ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఏఐ, గేమింగ్, కెమెరా మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ తదితరాల్లో మేము పేటెంట్లను కలిగిన ఏకైక బ్రాండ్‌గా ఉన్నాము. ఒప్పో 125W ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికత VOOCలో పలు ప్రత్యేకతలను కలిగి ఉండగా సురక్షితంగా, దక్షతను అందించడమే కాకుండా ఉత్తమ పనితీరును అందిస్తాయి. ఒప్పోలో మేము మాకు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకునే సాంతకేతికతలను పరిశోధన మరియు అభివృద్ధితో పాటు భారతదేశపు మార్కెట్‌కు ఉత్తమ రీతిలో సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని’’ వివరించారు.
125W ఫ్లాష్ ఛార్జ్: 5G యుగంలో వేగవంతమైన ఛార్జింగ్
125W ఫ్లాష్ సాంకేతికత ప్రత్యక్ష ఛార్జింగ్ సాంకేతికతను వినియోగించుకుంటుంది ఇది 4000 ఎంఎహెచ్ బ్యాటరీని 5 నిమిషాల్లో 41% వరకు ఛార్జ్ చేస్తుంది మరియు 20 నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్ చేస్తూ, అత్యంత వేగవంతమైన ప్రమాణాన్ని కలిగి ఉంది. గత తరపు సూపర్ VOOC మరియు VOOC ఫ్లాష్ ఛార్జ్ ప్రోటోకాల్స్‌తో ఇది ఇది ఒదిగిపోతుంది మరియు ఇది 65W PD మరియు 125W PPS మెయిన్ స్ట్రీమ్ ప్రోటోకాల్స్‌కు సరిదూగుతుంది. ప్రస్తుతం ఇది పరిశ్రమలో అత్యంత మెరుగైన ఫ్లాష్ ఛార్జింగ్ సాంకేతికతగా ఉంది.
సూపర్ VOOC సాంకేతికత డిజైన్‌తో రూపుదిద్దుకున్న 125W ఫ్లాష్ ఛార్జ్ సమగ్ర హార్డ్‌వేర్ ఆర్కిటెక్చర్ అప్‌గ్రేడ్ చేసుకుంది. ఇది 20V 6.25A వరకు ఛార్జింగ్ స్కీమ్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఛార్జింగ్ సమయాన్ని పరిణామకారిగా తక్కువ చేసేందుకు గమనార్హంగా మెరుగుపరచింది పవర్ డెన్సిటీ గుణాలు కలిగి ఉన్నప్పటికీ ఛార్జర్ సైజ్‌ను ఏ మాత్రం పెంచలేదు. బ్యాటరీ విషయానికి వస్తే ఇది డబుల్ 6C సెల్స్‌ను మహోన్నతమైన బ్యాటరీ నిష్పత్తి, పరిశ్రమంలో అగ్రగామిలో ఉండే పలు ట్యాబ్‌ల డిజైన్లు, ఛార్జ్ పంప్‌లు మరియు అత్యంత ఏకీకృత MCUను ఛార్జింగ్ దక్షతను మెరుగుపరచేలా రూపొందించింది.
దీనితో, 125W ఫ్లాష్ ఛార్జ్ గత సాంకేతికత సిస్టమ్ సురక్షత రక్షణ ప్రత్యేకతలను 10 తాత్కాలిక ఉష్ణోగ్రత సెస్సర్లతో మెరుగుపరచగా, ఇది ఛార్జింగ్ పరిస్థితులను గమనిస్తుంది మరియు ఛార్జింగ్ సమయంలో గరిష్ఠ సురక్షతను అందిస్తుంది. అంతే కాకుండా ఈ ప్లాట్‌ఫారం ఫ్యూజ్ ఓవర్ వోల్టేజ్ రక్షణ క్రమాలైన టైప్-సి నుంచి టైప్ సి వైర్ల వరకు అలానే మెరుగుపరచిన సురక్షత కోసం 128-బిట్ హై స్ట్రెంత్ ఎన్‌క్రిప్షన్ ఆల్గారిథాన్ని కలిగి ఉంది.
65W ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్: వైర్‌లెస్ సాంకేతికతను అభివృద్ధిపరచండంలో ముందంజ
వినియోగదారులు ఛార్జింగ్ కేబుళ్ల అడ్డంకులు మరియు అననుకూలతల నుంచి తప్పించుకునేందుకు మరియు తమ ఉపకరణాలను సాధ్యమైనంత వేగంగా ఛార్జింగ్ చేసుకోవాలని కోరుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమంటే మార్కెట్లో అగ్రగామి వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికత 65W ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్, ఇది స్వయం-అభివృద్ధి చెందిన ఐసోలేటెడ్ ఛార్జ్ పంప్ సాంకేతికతను అలవర్చకుంది మరియు సమాన డ్యుయల్-కాయిల్ డిజైన్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్ దక్షతను మరింత వృద్ధి చేస్తుంది.
ఒప్పో 65W ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ 4000 ఎంఎహెచ్ బ్యాటరీని అత్యంత వేగంగా 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్ చేస్తుంది. ఇది ఇంటర్‌ఫియర్‌ను, మరియు ఆవర్తనను తక్కువ చేస్తుంది మరియు దీనితో వైర్‌లెస్ ఛార్జింగ్‌ను విస్తృతంగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. బయటి వస్తువులను గుర్తించే పనితీరుతో ఈ సాంకేతికత అయిదు రెట్లు రక్షణ చర్యలను కలిగి ఉంది. ఇది క్యూఐ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా మరియు వినియోగదారులకు కేబుల్-రహితంగా అలానే సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
దీనితో ఒప్పో 65W ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌కు కన్సెప్షుయల్ వైర్‌లెస్ ఛార్జర్‌ను ప్రదర్శించింది. ఈ ఛార్జర్ అందంగా రూపొందించిన గాజును కలిగి, అది మోల్డ్ రహిత ర్యాపిడ్ ప్రొటో టైపింగ్ సాంకేతికతతో నిర్మాణమైంది మరియు వినియోగదారుల ఎలక్ట్రానిక్ మార్కెట్‌లో ఈ తరహా సాంకేతికతలో మొదటి అప్లికేషన్‌గా నిలిచింది.
ఈ ఛార్జర్ దిగువ భాగంలో సెమీకండక్టర్ కూలర్ ఉండడంతో ఇది వేడిని చల్లార్చేందుకు సహకరిస్తూ, హ్యాండ్‌సెట్ ఛార్జ్ చేసిన తరువాత వేడి కాకుండా చూసుకుంటుంది. ఈ విషయంలో ఫోన్ వెనుక భాగంలో ఉష్ణోగ్రతను 2డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా ఉంచుతూ, ఫ్యాన్ ఈ వేడిని నియంత్రిస్తుంది. ఈ ప్రత్యేక డిజైన్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌ను ఎక్కువ అనుకూలకరం చేస్తుంది మరియు ఎక్కువ శక్తి ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ప్రత్యేక ఫీచర్లు అంటే 65W ఎయిర్ VOOC వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ ప్రత్యేక మరియు అభూతపూర్వమైన ఛార్జింగ్ అనుభవాన్ని మరియు 5G యుగంలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన మొదటి ఛార్జర్‌గా ఎంపిక కానుంది.
ఉన్నత శక్తితో కూడిన అల్ర్టా-స్మాల్ ఛార్జర్ సిరీస్: కనిష్ఠ పరిమాణం మరియు సులభంగా తీసుకు వెళ్లవచ్చు.
ఒప్పో నేటి ప్రపంచానికి అత్యంత చిన్నదైన అలానే తేలికైన 50W మినీ సూపర్ VOOC ఛార్జర్ మరియు ప్రత్యేక డ్యుయల్-లెవల్ ఆర్కిటెక్చర్‌ను కలిగిన 100 ఫ్లాష్ ఛార్జర్ విడుదల చేసింది.
ఒప్పో 50W మినీ సూపర్ VOOC ఛార్జర్‌ను మల్టీ-రేడియన్ కర్వ్ ప్రాసెసింగ్ ద్వారా అభివృద్ధిపరచగా, ఇది బిజినెస్ కార్డ్ హోల్డర్ సైజ్‌లో ఉంటుంది; దీని వాల్ కేవలం 1.05 సెం.మీ. మేర మందంగా ఉంటుంది. దాని డిజైన్ కారణంగా వినియోగదారులు దాన్ని చొక్కా మరియు కోట్ జేబులో ఉంచుకోవచ్చు, దీనితో ప్రయాణంలో అత్యంత అనుకూలకరంగా తీసుకు వెళ్లవచ్చు. 50W మినీ సూపర్ VOOC ఛార్జర్ VOOC ప్రొటోకాల్‌తో సరిదూగుతూ 27W PD మరియు 50W PPS ముఖ్యవాహిని ప్రొటోకాల్స్‌కు మద్దతు ఇస్తుంది మరియు మొబైల్ ఫోన్లు మరియు ల్యాప్‌టాప్‌లు వంటి పలు ఉపకరణాలను ఛార్జ్ చేస్తుంది.
ఒప్పోలో ఇంజినీర్లు 50W మినీ సూపర్ VOOC ఛార్జర్‌లో విప్లవాత్మక ఆర్కిటెక్చర్‌ను డిజైన్ చేశారు మరియు నూతన టోపోలాజికల్ డిజైన్ ఉపయోగించి ఎక్కువ స్థలాన్ని తీసుకునే అంశాల సైజ్‌ను తగ్గించారు. ఇది అత్యంత దక్షత శక్తి పరివర్తనను సంప్రదాయక ఎలక్ర్టోలిటిక్ కెపాసిటర్‌ను నివారించడం ద్వారా అందిస్తుంది మరియు ఈ పరిశ్రమలో ప్రథమ, ఏవియేషన్-గ్రేడ్‌లో ఉన్నత శక్తి డయోడ్లు మరియు జిఎఎన్ ఉన్నత ఫ్రీక్వెన్సీ పవర్ సప్లయ్ సాంకేతికత పర్ల్స్ ఛార్జింగ్ కలిగి ఉండగా, ఇది చివరిగా ఉన్నత శక్తితో కూడిన ఛార్జర్ల నుంచి ఎక్కువ మినియేచరైజేషన్‌ను సాధిస్తుంది.
50W మినీ సూపర్ VOOC ఛార్జర్‌ను రూపొందించడంలో ఒప్పో 110W మినీ ఫ్లాష్ ఛార్జర్ పరిమాణం నిర్దేశించిన పరిమితులను మరియు ఉన్నత శక్తితో కూడిన అడాప్టర్ల దక్షతను అధిగమించింది. ఆవిష్కరాత్మక డ్యుయల్-లెవల్ ఆర్కిటెక్చర్ మాత్రమే కాకుండా ఉన్నత దక్షత శక్తి పరివర్తన మరియు చిన్నదైన డిజైన్లు దాని పరిమాణాన్ని కేవలం35.76 cm³ కు తగ్గించింది- ఇది 18W ఛార్జర్ పరిమాణానికి సమానంగా ఉంటుంది.
ఇంటెలిజెంట్ కనెక్టివిటీ యుగంలో ఒప్పో అత్యంత చిన్న ఛార్జర్ శ్రేణిలో ఫ్లాష్ ఛార్జింగ్‌ను ఎక్కడైనప్పటికీ, ఏ సమయంలో అయినా అందిస్తుంది. ఛార్జ్ అండ్ గో ఇప్పటి నూతన వాస్తవం, ఒక ఛార్జర్ పలు ఉపకరణాలకు సహకరిస్తుంది.
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) నిర్వహించిన ఇటీవలి సమీక్ష ప్రకారం ఒప్పో వినియోగదారుల హృదయాన్ని గెల్చుకుంది మరియు బ్యాటరీ ఛార్జింగ్ సాంకేతికతకు వస్తే నం.1 స్థానంలో ఉంది. ఒప్పో ఛార్జింగ్ టైమ్ స్యాటిస్‌ఫ్యాక్షన్ (94%) అలానే బ్యాటరీ బ్యాకప్ (95%) ఉండగా, అన్ని బ్రాండ్ల కన్నా ఇదే ఎక్కువ మార్కులు దక్కించుకుంది. జూన్ 2020 నాటికి ఒప్పో ఫ్లాష్ ఛార్జింగ్‌కు 2,800కు పైచిలుకు గ్లోబల్ పేటెంట్లకు అర్జీలు వేసుకుంది. కంపెనీ 30-ప్లస్ స్మార్ట్ ఫోన్ మోడళ్లు VOOC ఫ్లాష్ ఛార్జ్ సాంకేతికతను కలిగి ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 157 మిలియన్లకు పైగా ప్రజలకు అల్ర్టా-ఫాస్ట్ ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఇంటెలిజెంట్ కనెక్టివిటీ యుగంలో మొబైల్ ఫ్లాష్ ఛార్జ్ ప్లాట్‌ఫారాలను మెరుగుపరచే మరియు అప్‌గ్రేడ్ చేయడంలో పరిశ్రమలో ముందజంలో మరియు సాంకేతికతల అభివృద్ధిని కొనసాగించడం ద్వారా ఫ్లాష్ –ఛార్జింగ్ అనుభవాన్ని వినియోగించే అన్ని సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా తన వినియోగదారులకు అందిస్తోంది.